రామ్ చరణ్ కొత్త సినిమా నుంచి ఒక సర్ ప్రైజింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల రెండు భాగాల సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ట్రెండ్ గా మారిన నేపథ్యంలో గేమ్ ఛేంజర్ కూడా అదే దారిలో వెళ్తుందని టాక్ వినిపిస్తోంది. గేమ్ ఛేంజర్ మూవీని టూ పార్ట్స్ గా చేయాలని నిర్మాత దిల్ రాజు ప్రపోజ్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయం మీద హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ ఏ డెసిషన్ తీసుకోలేదట.

గేమ్ ఛేంజర్ సినిమా మొదలుపెట్టి రెండేళ్లు దాటింది. ఈ రెండేళ్లలో బడ్జెట్ బాగా పెరిగిపోయింది. పెట్టుబడితో పాటు వడ్డీల భారం కూడా రెట్టింపవుతోంది. ఎలాగూ లేటయ్యింది కాబట్టి ఇంకొంత టైమ్ తీసుకున్నా..రెండు భాగాలుగా సినిమాను చేస్తే బడ్జెట్ వైజ్ కలిసొస్తుందని దిల్ రాజు అనుకుంటున్నారట.

గేమ్ ఛేంజర్ రెండు భాగాలుగా రావడం ఖాయమైతే…ఇంకాస్త ఆలస్యం తప్పదు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కావాలి. అయితే ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నందున…ఎప్పటికి కంప్లీట్ అవుతుందో చెప్పలేని సిచ్యువేషన్ ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *