విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా ఓటీటీలో జోరు చూపిస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇండియా వైడ్ ర్యాంకుల్లో టాప్ 10లో ఉంది. టాప్ టెన్ లో ఈ సినిమా 3 స్థానాల్లో నిలవడం విశేషం. ఖుషి హిందీ వెర్షన్ టాప్ 4లో ఉండగా..నేషనల్ వైడ్ గా ఖుషి 5వ ప్లేస్ దక్కించుకుంది. ఖుషి తమిళ వెర్షన్ 10వ ప్లేస్ లో ఉంది. ఇలా టాప్ 10లో 3 స్థానాలు ఖుషికే దక్కడం విశేషం. అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ మధ్యన ఉన్న రెస్పాన్స్ ఆధారంగా ఈ రేటింగ్స్ ఇచ్చారు.

ఖుషిలో లోని లవ్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమర్, బ్యూటిఫుల్ సాంగ్స్, సాంగ్స్ పిక్చరైజ్ చేసిన కాశ్మీర్ లొకేషన్స్ అన్నీ ఓటీటీ ఆడియెన్స్ కు ప్లెజంట్ ఫీలింగ్ ఇస్తున్నాయి. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. సెప్టెంబర్ 1న థియేటర్స్ లో రిలీజైన ఖుషి అక్కడ మంచి సక్సెస్ అందుకుని ఈ నెల 1న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *