మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమాలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తున్న స్టార్స్ లిస్టు ఆగడం లేదు. ప్రతి భాష నుంచి ఒక స్టార్ హీరోను తన సినిమాలో నటించమని అడుగుతున్నారు మంచు విష్ణు. ఇలా మలయాళం నుంచి మోహన్ లాల్, తెలుగు నుంచి ప్రభాస్ కన్నప్పలో గెస్ట్ అప్పీయరెన్స్ కోసం కన్ఫర్మ్ అయ్యారు. ఇప్పుడు మరో స్టార్ హీరో ఈ ప్రాజెక్ట్ లో చేరబోతున్నారు.

కన్నడ ఇండస్ట్రీ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కన్నప్పలో ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నారట. ఇవాళ మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. శివన్న కన్నప్పలో నటిస్తున్నారనే ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ మంచు విష్ణు ఈ అప్ డేట్ ఇచ్చారు. తన ఎఫర్ట్స్ మొత్తం పెట్టి మంచు విష్ణు తన పాన్ ఇండియా మూవీకి రెడీ అవుతున్నారు. ఈ సినిమా మీద ఆయన చాలా హోప్స్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *