నాలుగైదేళ్ల కిందట యంగ్ హీరోయిన్ గా రెజీనా క్రేజ్ తెచ్చుకుంది. అయితే కంటిన్యూ సక్సెస్ లు లేకపోవడంతో స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లలేకపోయింది. ఆ మధ్య శాకినీ డాకినీ మూవీ చేసింది. ఈ రీమేక్ సినిమా హిట్ కాకపోవడంతో రెజీనాకు ఇక టాలీవుడ్ లో ఆఫర్స్ క్లోజ్ అయ్యాయి. దీంతో ఓటీటీ వైపు దృష్టి పెట్టింది రెజీనా. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మీద వెబ్ సిరీస్ లు చేస్తోంది.

ఈ టైమ్ లో రెజీనాకు కోలీవుడ్ నుంచి ఓ మంచి ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. అజిత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో రెజీనాకు అవకాశం దక్కిందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు మగిజ్ తిరుమేని రూపొందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. రెజీనాకు ఈ సినిమా మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *