రణ్ బీర్ కపూర్, రశ్మిక మందన్న జంటగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న పాన్ ఇండియా మూవీ యానిమల్ నుంచి ఫస్ట్ సింగిల్ అమ్మాయి రిలీజైంది. ఇంటెన్స్ లవ్ తో సాగిన ఈ పాట సందీప్ రెడ్డి స్టైల్ ఆఫ్ సాంగ్ మేకింగ్ ను మరోసారి చూపించింది. ఈ పాట నిండా రణ్ బీర్, రశ్మిక ముద్దులు వారి ప్రేమ మధ్య ఉన్న ఇంటెన్స్ చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

ఆమె కుటుంబ సభ్యుల మధ్యే రశ్మికను ముద్దు పెట్టుకోవడం, అక్కడి నుంచి ఛార్టెడ్ ఫ్లైట్ లో తీసుకెళ్లడం, హిమాలయాల్లో ఓ గుడిలో పెళ్లి చేసుకోవడం వంటి సీన్స్ ఈ పాటలో చూపించారు. అమ్మాయి పాటకు జామ్8 మ్యూజిక్ అందించగా..అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు. రాఘవ్ చైతన్య, ప్రీతమ్ పాడారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కు రెడీ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *