ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా కల్కి 2898ఏడీలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇవాళ అమితాబ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మీ జర్నీలో భాగమవడం గర్వంగా ఉంది, మీ గొప్పదనం ఎలాంటిదో ప్రత్యక్షంగా చూశామంటూ మేకర్స్ విశెస్ తెలిపారు. ఒక యోగి లాంటి పాత్రలో అమితాబ్ నటిస్తున్నట్లు ఈ లుక్ ద్వారా తెలుస్తోంది. హీరో క్యారెక్టర్ కు గురువు లాంటి పాత్ర ఇదని అనుకోవచ్చు.

కమల్ హాసన్, దిశా పటానీ, దీపికా పదుకోన్, మనోజ్ బాజ్ పాయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా వైజయంతీ మూవీస్ సంస్థ సుమారు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తోంది. సైన్స్ ఫిక్షన్ కథతో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేస్తారని అనుకున్న ఈ మూవీ మేకింగ్ లో ఆలస్యం వల్ల వచ్చే జనవరికి రాలేకపోయింది. వచ్చే ఏడాది సమ్మర్ లో కల్కి 2898 ఏడీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *