విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంటోనీ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా అమోజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ యాక్షన్ డ్రామా ఫిల్మ్ గత నెల 15న పాన్ ఇండియా స్థాయిలో రిలీజైంది. తమిళంలో ఈ సినిమాకు కలెక్షన్స్ బాగున్నా…తెలుగులో మాత్రం సక్సెస్ కాలేదు. థియేటర్స్ లోకి మార్క్ ఆంటోనీ అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది.

మార్క్ ఆంటోనీ సినిమాను మినీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై వినోద్ కుమార్ నిర్మించారు. ఈ సినిమాకు అధిక్‌ ర‌విచంద్ర‌న్ దర్శకత్వం వహించారు. రీతూవ‌ర్మ హీరోయిన్ గా నటించగా..ఎస్.జె.సూర్య, సునీల్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా హిందీ సెన్సార్ కోసమే లంచం ఇచ్చానంటూ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు విశాల్. ప్రస్తుతం ఈ కేసులో సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *