ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట విషాధం నెలకొంది. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి నిన్న రాత్రి అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్నుమూశారు. గత కొద్ది కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న ఆరోగ్యం విషయమించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. చికిత్స పొందుతూ రాత్రి శ్యామ్ సుందర్ రెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 86 ఏళ్లు

నిర్మాతగా దిల్ రాజు ఎదుగుదలలో తండ్రిగా శ్యామ్ సుందర్ రెడ్డి సపోర్ట్ ఎంతగానో ఉంది. ఈ ఉదయం శ్యామ్ సుందర్ రెడ్డి భౌతిక కాయాన్ని దిల్ రాజు ఇంటికి తరలించారు. అక్కడి నుంచి మహాప్రస్థానంకు అంతిమయాత్ర సాగనుంది. మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. దిల్ రాజు తండ్రి మృతి పట్ల పలువురు టాలీవుడ్ హీరోలు సంతాపాన్ని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *