కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కమల్ హాసన్ భారతీయుడు పాత్రకు డబ్బింగ్ చెబుతున్న వీడియోను నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. కమల్ డబ్బింగ్ తో ఈ సినిమా రూపకల్పన ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

1996లో వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో రకుల్ ప్రీత్, కాజల్, ప్రియ భవానీ శంకర్, నయనతార, సిద్ధార్థ్ నటిస్తున్నారు. వాస్తవంగా రాబోయో సంక్రాంతికి ఇండియన్ 2 రిలీజ్ కావాలి. అయితే ఈ సినిమా విషయంలో ఎన్నో కోర్టు కేసులో, సెట్ లో ప్రమాదాలు వంటివి జరిగి షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. వచ్చే ఏడాది సమ్మర్ కల్లా మూవీ రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *