చిన్న డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ కథలను హీరోలతో ఒప్పించేందుకు నానా తిప్పలు పడి కథలు అందంగా, ఇంట్రెస్టింగ్ గా నెరేట్ చేయాలని ప్రయత్నిస్తుంటారు. కానీ స్టార్ డైరెక్టర్స్ కు ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. ఆ డైరెక్టర్స్ తో సినిమా చేయాలని హీరోలు ముందే ఫిక్సయి ఉంటారు కాబట్టి కథేంటో, అందులోని లోటుపాట్లేంటో అడిగే అవకాశం ఉండకపోవచ్చు. రాజమౌళి లాంటి దర్శకుడిని క్వశ్చన్ చేసే పరిస్థితే ఉండదు.

బాహుబలి క్యారెక్టర్ వరకు చెప్పాడట రాజమౌళి ప్రభాస్ కు. ఇప్పుడు మహేశ్ విషయంలోనూ అదే జరుగుతుంది. కథ ఔట్ లైన్ ఇది, మీ క్యారెక్టర్ ఇది, ఇలా ఉంటుందని చెబుతాడు అంతే కానీ పూసగుచ్చినట్లు మొత్తం కథ చెప్పడం ఉండకపోవచ్చు. రాజమౌళి మహేశ్ ను కలిసి కథ చెప్పాడని నెట్టింట న్యూస్ వైరల్ అవుతోంది.

వీరిద్దరు కలిసి ఎస్ఎస్ఎంబీ29 అనే ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ కానుంది. వచ్చే ఏడాది చివరి కల్లా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ లో కేఎల్ నారాయణ నిర్మించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *