అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “రాక్షస కావ్యం”. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మించారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందించారు. రా అండ్ రస్టిక్ మూవీగా “రాక్షస కావ్యం”కు ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. “రాక్షస కావ్యం” మూవీ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో హీరో అభయ్ నవీన్ మాట్లాడుతూ- “రాక్షస కావ్యం” సినిమా కంటెంట్ ఎంత కొత్తగా ఉంటుందో మీరు టీజర్, ట్రైలర్, పాటల ద్వారా చూశారు. ఇటీవల మేము ఈ సినిమా చూడాలని కోరుకున్న వారికి ప్రీమియర్స్ వేశాం. వాళ్లంతా సినిమా తమకు బాగా నచ్చిందని అప్రిషియేట్ చేశారు. ఈ నెల 13 థియేటర్స్ లోకి వస్తున్న “రాక్షస కావ్యం” తప్పకుండా మీ అందరికీ సినిమా నచ్చుతుంది. మా సినిమాలో మీకు నచ్చిన విషయాన్ని ఇతరులకు షేర్ చేయండి. మీ వల్ల ఒక మంచి సినిమాకు పేరొస్తే హ్యాపీగా ఫీలవుతాం. అన్నారు.

డైరెక్టర్ శ్రీమాన్ కీర్తి మాట్లాడుతూ – బడ్జెట్ వైజ్ చిన్న సినిమా అయిన ఇది కంటెంట్ పరంగా పెద్ద సినిమా. పురాణాల్లోని జయవిజయుల పాత్రల్ని స్ఫూర్తిగా తీసుకుని కలియుగంలో వారు జన్మిస్తే ఎలా ఉంటుందనే ఊహతో రాసుకున్న స్క్రిప్ట్ ఇది. “రాక్షస కావ్యం” చూడాలనుకునే వారి కోసం మేము ఒక పోస్ట్ పెట్టాం. ఆ పోస్ట్ కు రెస్పాండ్ అయిన ప్రేక్షకులకు ఐదు ప్రీమియర్ షోస్ వేశాం. ఇందులో మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేరు. బయటి వాళ్లు సినిమా చూస్తే ఎలా రియాక్ట్ అవుతారు అని తెలుసుకోవాలని అనుకున్నాం. సినిమా చూసిన వాళ్లందరి నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. రేపు 13న థియేటర్స్ లోనూ ఇదే రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం.అన్నారు. నిర్మాత దామురెడ్డి మాట్లాడుతూ – “రాక్షస కావ్యం” సినిమాతో మేమొక డిఫరెంట్ ప్రయోగాత్మక సినిమా చేశాం. సినిమాలో మంచి ఎమోషన్ ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. స్లమ్ లో జరిగే కథ ఇది. స్లమ్ లైఫ్ తెలంగాణలోనే కాదు ఏపీ, బీహార్, ఒరిస్సా ఎక్కడికి వెళ్లినా ఒకేలా ఉంటుంది. తెలంగాణ సినిమాల్లో ఆల్కహాల్ అలవాటును ఎక్కువగా చూపిస్తున్నారనే విమర్శకు సమాధానంలా మా సినిమా ఉంటుంది. ట్రైలర్ లో హింస, ఆల్కహాల్ అనేవి కనిపిస్తున్నా..సినిమాలో అవి వద్దనే మంచి సందేశాన్ని ఇచ్చాం. ఈ కథలో చదువు గొప్పదనం చెబుతున్నాం. స్లమ్ లో తల్లి లేని పిల్లలు ఎలా బాధలు పడతారు. అలాగే ఆల్కహాల్ వల్ల ఒక కుటుంబం ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటుంది అనే అంశాలు చూపిస్తున్నాం. సినిమాలోని ప్రతి క్యారెక్టర్ మనకు తెలిసినట్లు, మనం చూసిన క్యారెక్టర్ లా ఉంటుంది. మా సినిమాకు ఆడియెన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ కోసం వేచి చూస్తున్నాం. అన్నారు.

హీరో అన్వేష్ మైఖేల్ మాట్లాడుతూ – హైదరాబాద్ స్లమ్ లోని ఓ కుటుంబం నేపథ్యం సాగే సినిమా ఇది. అమ్మ నాన్న ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఈ కుటుంబంలో ఎవరి కోరికలు, ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి. వారి గమ్యాలను చేరుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో ఏం జరిగింది అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అభయ్, నేను కలిసి గతంలో నిరుద్యోగ నటులు అనే షార్ట్ ఫిలిం చేశాం. అది దాము అన్న ప్రొడ్యూస్ చేశారు. అప్పటి నుంచి మా మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. బ్రదర్స్ లా అభయ్, నేను పోటాపోటీగా నటించాం. మా పర్ ఫార్మెన్స్ ను స్క్రీన్ మీద ఎంజాయ్ చేస్తారు. రాక్షసకావ్యం తెలుగు ఆడియెన్స్ అందరూ ఇష్టపడే మూవీ అవుతుంది. అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *