ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మారారు లోకేష్ కనకరాజ్. ఆయన కొత్త సినిమా లియో రిలీజ్ కు రెడీ అవుతోంది. కోలీవుడ్ లో ప్రతి స్టార్ హీరో ఆయనతో వర్క్ చేయాలని కోరుకుంటున్నారు. అలాంటి క్రేజ్ లో లోకేష్ ప్రభాస్ తో సినిమా చేయాలని ఉందంటూ చెప్పారు. కెరీర్ లో కేవలం పది సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేసి ఆ తర్వాత రిటైర్ అవుతానని చెప్పిన లోకేష్..ఆ పదో సినిమా ప్రభాస్ తో చేస్తారని తెలుస్తోంది.

విక్రమ్ రికార్డ్ హిట్ తర్వాత లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనే అంశం ఇండస్ట్రీలో సర్క్యులేట్ అవడం మొదలైంది. విక్రమ్ సినిమా ఖైదీ సినిమాతో చిన్న లింక్ పెట్టడంతో…ఇప్పుడు లియో కథ కూడా విక్రమ్ కు రిలేట్ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇలా లోకేష్ చేయబోయే ప్రతి సినిమా కథలు ఏదో ఒక కంటిన్యుటీ లింక్ తో ఉంటాయని ప్రచారం జరుగుతోంది. వీటిలో ఎండ్ గేమ్ లాంటి చివరి సినిమా ప్రభాస్ హీరోగా చేస్తారని తెలుస్తోంది. ప్రభాస్ తో తన సినిమాను రీసెంట్ లియో ఇంటర్వ్యూస్ లో కన్ఫర్మ్ చేశాడు లోకేష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *