టాలీవుడ్ లో జూనియర్ గా కనిపించే సీనియర్ నటుడు బ్రహ్మాజీ. భూమి పుట్టినప్పటి నుంచి నటిస్తున్నాడు అని ఆయనపై జోక్స్ వేస్తుంటారు సహ నటులు. బ్రహ్మాజీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇవాళ ఆయన ఉన్నట్లుండి నేను రిటైర్ అవుతా అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నెటిజన్స్ లో ఆసక్తి కలిగిస్తోంది.

ఇవాళ నవీన్ పోలిశెట్టికి సంబంధించిన ఓ వీడియోను రీట్వీట్ చేస్తూ..ఈ అబ్బాయి యాక్టింగ్ టాలెంట్ చూస్తుంటే భయమేస్తోంది. నవీన్ పోలిశెట్టి నటించిన హిందీ సినిమా చిచ్చోరేలోని ఇంజినీరింగ్ స్టూడెంట్స్ డైలాగ్ ను ఆయన కొత్త సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో అనుష్కతో చెప్పిన ఇంజినీరింగ్ స్టూడెంట్ డైలాగ్ తో కంపేర్ చేస్తూ ఉందా వీడియో. ఈ వీడియోకు కామెంట్ చేస్తూ ఇక నేను రిటైర్ అయిపోతే బెటర్ అంటూ పోస్ట్ చేశారు.

దీనికి నవీన్ పోలిశెట్టి స్పందిస్తూ మీకు పవర్ ఉంది మాకు బ్రెయిన్ ఉంది మనం ఇద్దరం కలిసి పనిచేస్తే…అంటూ జాతిరత్నాలు సినిమాలో వీరి కాంబోలో వచ్చే సీన్ డైలాగ్ గుర్తుచేశారు. నవీన్ పోలిశెట్టి, బ్రహ్మాజీ మధ్య ఈ ఛాట్ హ్యూమరస్ గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *