వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఘనంగా జరిగాయి. నిన్న రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు. రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సహా మిగతా కుటుంబ సభ్యులు పాల్గొని ప్రీ వెడ్డింగ్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ రాలేకపోయారు.

త్వరలో ఇటలీలో వరణ్ తేజ్, లావణ్య వివాహం జరగనుంది. మూడు రోజుల పాటు సాగే ఈ పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా హాజరుకానున్నారు. వారంతా వారం రోజుల పాటు ఇటలీలో గడపుతారని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం వరుణ్, లావణ్య నిశ్చితార్థం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఇటీవల ముంబై వెళ్లిన వరుణ్, లావణ్య అక్కడ ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో తమ వెడ్డింగ్ డ్రెస్ డిజైన్ కు ఇచ్చి వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *