డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించే మూవీస్ కొందరు హీరోలకు ఇబ్బందిగా మారుతుంటాయి. అప్పట్లో నాగార్జునకు బోయపాటి ఓ కథ చెప్పాడట. ఆ కథ చెప్పే విధానం, వాడిన మాటలు విని…అంత వైల్డ్ మూవీ అయితే నాలాంటి ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న హీరోకు ప్రాబ్లమ్ కదా అని ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశాడట నాగార్జున. ఇప్పుడు ఇలాంటి భయమే మహేశ్ కూడా పడుతున్నారు. ఆ విషయం రీసెంట్ గా బోయపాటి మాటల్లోనే వెల్లడైంది.

మహేశ్ తో బోయపాటి శ్రీను ఓ సినిమా చేయాలని అనుకున్నారు. అయితే ఈ డైరెక్టర్ సినిమాల్లోని వైల్డ్ యాక్షన్, నరకడాలు మహేశ్ కు నచ్చలేదు. ఈ హింస విషయంలో మహేశ్ బోయపాటి దగ్గర సందేహాలు వ్యక్తం చేశారట. అలా వీరి ప్రాజెక్ట్ లేటవుతూ వస్తోంది. బోయపాటి మాత్రం నా హీరోల ఇమేజ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమాలు చేస్తుంటాడు. మహేశ్ కు కూడా అదే మాటిచ్చాను అంటున్నాడు. మహేశ్ తన ఇమేజ్ ను పక్కన బెట్టి బోయపాటితో సినిమా చేస్తాడా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *