పండుగల టైమ్ లో స్టార్స్ సినిమాలు వస్తాయి కాబట్టి ఫెస్టివల్ సీజన్స్ ముందు చిన్న సినిమాలు రిలీజ్ కు క్యూ కడుతుంటాయి. ఇలా దసరా ముందు నిన్న అరడజను చిన్న సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. వీటిలో రూల్స్ రంజన్, మంత్ ఆఫ్ మధు, మ్యాడ్, 800, మామా మశ్చీంద్ర…వంటి సినిమాలు ఉండగా..వీటిలో మ్యాడ్ సినిమా ఒక్కటే థియేటర్స్ దగ్గర ఇంపాక్ట్ చూపిస్తోంది.

నిన్న రిలీజైన వాటిలో సుధీర్ బాబు మామా మశ్చీంద్ర, కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ సినిమాల మీద కాస్తో కూస్తో ఎక్స్ పెక్టేషన్స్ ఉండగా…వీటిని కాదని కొత్త ఆర్టిస్టులు చేసిన మ్యాడ్ పైచేయి సాధించింది. ఫస్ట్ డే మ్యాడ్ సినిమాకు 1.8 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దక్కాయి.

నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ హీరోలుగా నటించిన మ్యాడ్ సినిమాను కల్యాణ్ శంకర్ రూపొందించారు. సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన మ్యాడ్ యూత్ ఆడియెన్స్ ను ఆకర్షిస్తోంది. నెక్ట్ వీక్ కలెక్షన్స్ ఈ సినిమా ఫలితాన్ని నిర్దేశించబోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *