హీరో నవదీప్ డ్రగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. నైజీరియాకు చెందిన డ్రగ్ సప్లయర్ తో నవదీప్ టచ్ లో ఉన్నట్లు పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తేల్చారు. దీంతో ఇటీవల నవదీప్ ను విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. దీంతో ఒకవైపు యాంటిసిపేటరీ బెయిల్ కు అప్లై చేస్తూనే పోలీసుల విచారణకు హాజరయ్యారు నవదీప్.

తాజాగా గతంలో జరిగిన డ్రగ్ కేసును కూడా ఈ కొత్త డ్రగ్ కేసుకు ముడివేసి రెండింటి మీదా విచారణ జరుపుతున్నారు అధికారులు. 2017లో కూడా డ్రగ్ రాకెట్ బయటపడ్డప్పుడు నవదీప్ పేరు నిందితుల జాబితాలో ఉంది. ఆ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ భావిస్తోంది.

ఈ విచారణ కోసం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుంచి నవదీప్ కు నోటీసులు పంపించారు. ఈ నెల 10న ఈడీ ముందు నవదీప్ హాజరుకావాల్సిఉంది. మిగతా అన్ని కేసుల కంటే ఈడీ కేసు పవర్ ఫుల్ కాబట్టి డ్రగ్స్ వ్యవహారం ఈ నటుడి మెడకు చుట్టుకున్నట్లే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *