బాలీవుడ్ స్టార్ షారుఖ్, తమిళ స్టార్ విజయ్ కలిసి సినిమా చేసేందుకు ఒప్పుకుంటే వారితో 3 వేల కోట్ల రూపాయల కలెక్షన్స్ చేసే బ్లాక్ బస్టర్ మూవీ చేస్తానని అంటున్నారు యంగ్ డైరెక్టర్ అట్లీ. విజయ్ తో మూడు సూపర్ హిట్ సినిమాలు చేసిన అట్లీ..షారుఖ్ తో రీసెంట్ గా జవాన్ రూపొందించి రికార్డ్ హిట్ అందుకున్నారు.

జవాన్ రికార్డ్ స్థాయి విజయంతో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన నేపథ్యంలో అట్లీ జవాన్ 2 సినిమా కూడా చేస్తాడనే ప్రచారం ఊపందుకుంది. జవాన్ 2 లో షారుఖ్ తో పాటు విజయ్ కూడా నటిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో డైరెక్టర్ అట్లీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒక మంచి మల్టీస్టారర్ కథ కుదిరి, ఈ ఇద్దరు స్టార్స్ సినిమా చేస్తే అది తప్పకుండా అట్లీ చెప్పినంత పెద్ద హిట్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *