రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో రిలీజ్ కాబోతోంది. దివ్యాంగులైన వారు సినిమా డైలాగ్స్ వినలేరు, ఆ మూవీ గురించి మాట్లాడలేరు. ఇలాంటి వారి కోసం టైగర్ నాగేశ్వరరావు సినిమా సైన్ లాంగ్వేజ్ లో చూపించబోతున్నారు. తెలుగు సినిమా హిస్టరీలో ఇదొక కొత్త ప్రయత్నంగా చెప్పవచ్చు.

స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వంశీ. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల 20న టైగర్ నాగేశ్వరరావు సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను కూడా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇవాళ ప్రకటించారు. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *