వరుస ఫ్లాప్స్ తర్వాత దర్శకుడు శ్రీను వైట్ల హీరో గోపీచంద్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమా షూటింగ్ ఇటలీలోని మిలన్ లో చేస్తున్నారు. ఈ ఫొటోస్ ను దర్శకుడు, నిర్మాణ సంస్థ చిత్రాలయం స్టూడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్టు పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

అసలే ఫ్లాప్స్ మీద ఫ్లాప్స్ వచ్చినా దర్శకుడు శ్రీను వైట్ల తరహా మారలేదని, సినిమా స్టార్ట్ కాగానే విదేశీ షూటింగ్ లకు వెళ్లాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హీరో గోపీచంద్ కూడా వరుస ఫ్లాప్స్ లో ఉన్నందున తక్కువ బడ్జెట్ లో మూవీ చేసుకోవచ్చు కదా అని సూచిస్తున్నారు.

శ్రీనువైట్ల గత సినిమాలు ఓవర్ బడ్జెట్ అయ్యాయి. మేకింగ్ లో అనవసరపు ఖర్చు ఉండేది. ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్ లోనూ తన వరుస మార్చకుండా పాత రూట్ లోనే వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇది కొత్త ప్రొడక్షన్ హౌస్ మీద ఎఫెక్ట్ చూపించేలా ఉంది. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు శ్రీను వైట్ల.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *