ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాను రెండు భాగాలుగా తీసుకొస్తున్నట్లు దర్శకుడు కొరటాల శివ చెప్పారు. కథ స్పాన్ పెద్దది కాబట్టి, ఆ ప్రపంచాన్ని వివరంగా చూపించాలంటే టు పార్ట్ మూవీ కావాలని టీమ్ అంతా అనుకున్నామని కొరటాల చెప్పారు. దేవర ఫస్ట్ పార్ట్ మాత్రమే ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించడం అనేది మరింత టైమ్ తో కూడుకున్న వ్యవహారం. దీంతో ఎన్టీఆర్ తదుపరి సినిమా ఎన్టీఆర్ 31 సెట్స్ మీదకు వెళ్లడం ఇంకా లేటయ్యేలా ఉంది. ఎన్టీఆర్ 31 సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.

ఎన్టీఆర్ బర్త్ డే కు అఫీషియల్ గా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ దేవర ఓపెనింగ్ కు ప్రశాంత్ నీల్ గెస్ట్ గా వచ్చారు. ఎన్టీఆర్ 31న వచ్చే సమ్మర్ లో ఫార్మల్ గా ప్రారంభించాలని అనుకున్నారు. అయితే దేవర షూటింగ్ కే నెక్ట్ ఇయర్ కూడా పట్టేలా ఉంది. దీంతో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ వచ్చే ఏడాది కూడా మొదలయ్యేలా లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *