రాజు గారి గది సిరీస్ సినిమాలతో ప్రేక్షకుల్ని హారర్ కామెడీతో ఆకట్టుకున్న దర్శకుడు ఓంకార్ ఈసారి మాన్షన్ 24 అనే సరికొత్త హారర్ వెబ్ సిరీస్ తో రాబోతున్నారు. హాట్ స్టార్స్ స్పెషల్స్ గా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మాన్షన్ 24లో వరలక్ష్మి శరత్ కుమార్, అవికా గోర్, బిందు మాధవి, నందు, మానస్, అయ్యప్ప పి.శర్మ, రావు రమేష్  తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మాన్షన్ 24 ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ – ఈ వెబ్ సిరీస్ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించేందుకు డిస్నీ హాట్ స్టార్ తో పాటు మా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఎంతో సపోర్ట్ చేశారు. డీవోపీ మనోజ్, ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు, మ్యూజిక్ చేసిన వికాస్ ..ఇలా వీళ్లంతా ఫిల్లర్స్ లా ఉన్నారు. ఆర్టిస్టులంతా బాగా సపోర్ట్ చేశారు. వరలక్ష్మి గారు ఉన్న బిజీలో సాయంత్రం 6 గంటలకు సెట్ నుంచి వెళ్లిపోవచ్చు. కానీ క్లైమాక్స్ టైమ్ లో రాత్రి 12, ఒంటిగంట వరకు వర్క్ చేశారు. నాకు బలం నా తమ్ముళ్లు కల్యాణ్, అశ్విన్. వాళ్లు లేకుంటే నేను  ఈ స్టేజీ మీద ఉండేవాడిని కాదేమో. మాన్షన్ 24 లోని ఆరు ఎపిసోడ్స్ కంటిన్యూగా చూసేంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ ఒక హుక్ పాయింట్ తో ఎండ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. కోవిడ్ టైమ్ లో నేను టీవీ ప్రోగ్రామ్స్ పైనే దృష్టి పెట్టాను. కోవిడ్ లేకుంటే మరో సినిమా చేసేవాడిని. జానర్ మార్చి సినిమాలు చేయబోతున్నా. హారర్ జానర్ కాకుండా నేను చేయబోయే కొత్త సినిమా ఒకటి డిస్కషన్స్ లో ఉంది. అన్నారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – మాన్షన్ 24 సిరీస్ ట్రైలర్ బాగుంది. ఈ సిరీస్ కు మంచి టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్ కుదిరారు. వీళ్లలో చాలా మంది నాకు తెలుసు. వరలక్ష్మి గారు లీడ్ రోల్ చేశారు. ఆమె నాంది, క్రాక్, వీరసింహారెడ్డి ఇలా ప్రతి సినిమాతో వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఆమెను లేడీ ఎస్వీఆర్ పిలవొచ్చు. ఓంకార్ నాకు పటాస్ టైమ్ నుంచి పరిచయం. ఆయన ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న మాన్షన్ 24 సిరీస్ హిట్ ఇవ్వాలి. అశ్విన్ నాకు మంచి ఫ్రెండ్. ఓంకార్ సినిమాలు కూడా కంటిన్యూ చేయమని కోరుతున్నా. అలాగే మీ బ్రదర్స్ మధ్య ఉన్న అనుబంధంతో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలని కోరుతున్నా. అన్నారు. హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ – అన్నయ్య ఓంకార్ తో వెబ్ సిరీస్ చేసే అవకాశం కల్పించిన డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కు బిగ్ థ్యాంక్స్. ఇవాళ అన్నయ్య ఓంకార్ బర్త్ డే. ఆయనకు బర్త్ డే విశెస్ చెబుతున్నా. ఈ సిరీస్ ఒక ప్రొడ్యూసర్ గా కాదు ఆడియెన్ గా నాకు బాగా నచ్చింది. టీవీలో అన్నయ్యని ప్రేక్షకులు ఆదరించారు. అలాగే సినిమాల్లో రాజు గారి గది మూవీస్ తో సక్సెస్ ఇచ్చారు. మాన్షన్ 24 వెబ్ సిరీస్ తో కూడా అన్నయ్య తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అన్నారు. నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ – డైరెక్టర్ ఓంకార్,  డీవోపీ మనోజ్ పర్పెక్షనిస్టులు. ఫ్రేమ్ లో ఏ చిన్న తేడా ఉన్నా..ఆ సీన్ మళ్లీ చేస్తారు. ఇవాళ ఓంకార్ గారి బర్త్ డే. ఇలాంటి మంచి ట్రైలర్ ను ఆయన బర్త్ డే రోజున రిలీజ్ చేశాం. నాకు ట్రైలర్ బాగా నచ్చింది. మాన్షన్ 24 పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *