ఆనంద్ దేవరకొండ సినిమాకు మరోసారి సపోర్ట్ గా నిలిచింది నేషనల్ క్రష్ రశ్మిక మందన్న. గతంలో ఆనంద్ “బేబి” సినిమా నుంచి ప్రేమిస్తున్నా సాంగ్ రిలీజ్ చేసిన తన లక్కీ హ్యాండ్ ను ఆ సినిమాకు అందించిన రశ్మిక..ఇప్పుడు ఆనంద్ కొత్త సినిమా “గం..గం..గణేశా”కు కూడా తన సపోర్ట్ ఎక్స్ టెండ్ చేస్తోంది.

ఈ సినిమా నుంచి బృందావనివే లిరికల్ సాంగ్ ను రశ్మిక ఇవాళ రిలీజ్ చేసింది. బృందావనివే పాట బిగ్ హిట్ కావాలని రశ్మిక బెస్ట్ విశెస్ తెలియజేసింది. తమ సినిమాలోని పాట రిలీజ్ చేసిన రశ్మికకు థాంక్స్ చెప్పారు హీరో ఆనంద్ దేవరకొండ. బ్యూటిఫుల్ మెలొడీ సాంగ్ బృందావనివే మీకు నచ్చుతుందని ఆయన ట్వీట్ చేశారు.

చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన బృందావనివే పాటకు వెంగి సుధాకర్ లిరిక్స్ అందించారు. సిధ్ శ్రీరామ్ తో కలిసి చేతన్ భరద్వాజ్ ఈ పాట పాడారు. “గం..గం..గణేశా” సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ బొమ్మిశెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. “గం..గం..గణేశా” త్వరలో థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *