దసరా మూవీ బ్లాక్ బస్టర్ తో హీరో నాని రెమ్యునరేషన్ హైక్ చేశాడు. ఈ హీరో 15 కోట్ల నుంచి ఇప్పుడు 20 కోట్లకు పైనే ఫీజు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని నటిస్తున్న హాయ్ నాన్న మూవీకి 22 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చారట. మీడియం రేంజ్ హీరోల్లో నానిదే హయ్యెస్ట్ ఫీజు అనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఓటీటీ, డిజిటల్ రైట్స్, పాన్ ఇండియా రిలీజ్ లకు వచ్చే ఆదాయం పెరగడంతో నాని కూడా రేటు పెంచాడని అనుకోవచ్చు.

నాని హాయ్ నాన్న మూవీ డిసెంబర్ లో రిలీజ్ కానుంది డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. డిసెంబర్ 22న రిలీజ్ చేద్దామని ముందు అనుకున్నా…సలార్ అదే డేట్ కు వస్తుండటంతో హాయ్ నాన్న డేట్ డిసెంబర్ 7కు మారినట్లు తెలుస్తోంది. నానితో డిస్కషన్స్ లో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

ఒకటి డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలో వివేక్ ఆత్రేయ రూపొందించే సినిమా కాగా…మరొకటి శ్రీనివాసా చిట్టూరి నిర్మాణంలో తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి తెరకెక్కించే సినిమా. డీవీవీ సంస్థలో చేస్తున్న సినిమాకు నాని పాతిక కోట్ల రెమ్యునరేషన్ అడుగుతున్నట్లు టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *