ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర రెండు భాగాలుగా రానుంది. గత కొద్ది రోజులుగా ఈ విషయం నెట్టింట చక్కర్లు కొడుతున్నా…ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను కొరటాల శివ రూపొందిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించబోతున్నారు.

ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నారు. ఫస్ట్ పార్ట్ ఈ డేట్ కు వస్తుందని, సెకండ్ పార్ట్ డేట్ తర్వాత వెల్లడిస్తామని టీమ్ తెలిపింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలోో దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ – దేవరలో ఒక కొత్త పాయింట్ చూపిస్తున్నాం. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో వచ్చిన ఔట్ పుట్ చూసి ఇందులో ఒక్క సీన్, ఒక్క డైలాగ్ కట్ చేయలేం అనిపించింది. దేవర ప్రపంచం అంత విస్తృతంగా ఉంటుంది. అందుకే ఈ కథను ఒక్క పార్ట్ లో చెప్పలేమని, రెండు భాగాలుగా చేసేందుకు నిర్ణయించాం. అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *