2 పార్ట్ మూవీస్ ఇప్పుడొక ట్రెండ్ అయ్యాయి. బాహుబలి, కేజీఎఫ్, సలార్..ఇలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ రెండు పార్ట్స్ గా తెరకెక్కడం తెలిసిందే. విజయ్ దేవరకొండ కొత్త సినిమా కూడా ఇలాగే రెండు భాగాల సినిమాగా రాబోతోందని సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలో గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది.

ఈ సినిమాను పోలీస్ అధికారి నుంచి మాఫియా డాన్ గా ఎదిగిన ఓ వ్యక్తి జీవిత కథతో ఇంట్రెస్టింగ్ గా దర్శకుడు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు భాగాలుగా సినిమాను రూపొందించేంత డెప్త్ కథ ఉంది కాబట్టే టీమ్ ఈ డెసిషన్ తీసుకున్నారట. ఓ కొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ వీడీ 12 ఇవ్వబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రశ్మిక మందన్న నటించనుంది. ఇలా టు పార్ట్స్ మూవీ చేయడం విజయ్ దేవరకొండ కెరీర్ లో ఇదే ఫస్ట్ టైమ్ కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *