సిద్ధార్థ్ హీరోగా నటించిన తమిళ సినిమా చిత్తా..తెలుగులో చిన్నా పేరుతో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో నిమిషా సాజయాన్ హీరోయిన్ గా నటించింది. ఎస్ యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సిద్ధార్థ్ నిర్మించారు. ఇప్పటికే తమిళం, కన్నడలో రిలీజై మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగులో ఈ నెల 6న విడుదలకు సిద్ధమవుతోంది.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో సుందరి అనే పాప తప్పిపోవడం, ఆ పాపను కిడ్నాప్ చేసిన వారు ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా మత్తు మందు ఇచ్చి తీసుకెళ్లడం చూపించారు. సుందరి అనే పాప కోసం హీరో చిన్నా ఎలాంటి పోరాటం చేశాడనేది ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. చిన్నా పోరాటానికి తోడుగా నిలిచే క్యారెక్టర్ లో నిమిషా సాజయాన్ నటించింది.

చిన్న పిల్లల మీద జరుగుతున్న అకృత్యాలను కథాంశంగా తీసుకుని సందేశాత్మకంగా, నేటి సమాజంలోని పరిస్థితులను చూపిస్తూ ఈ సినిమాను రూపొందించినట్లు ఇప్పటికే తమిళ, కన్నడ రివ్యూస్ చెబుతున్నాయి. సిద్ధార్థ్ కెరీర్ లో ఇదొక ప్రత్యేక సినిమాగా నిలవనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *