ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకు బాలీవుడ్ సినిమాలేే పోటీ. తెలుగు లాంటి సౌత్ సినిమాలకు హిందీ సినిమాలతో కంపేరిజన్ ఉండేదే కాదు. వేటి రిలీజ్ గొడవ వాటిదే, ఎక్కడి రికార్డుల లెక్కలు అక్కడివే. కానీ పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక…సౌత్ సినిమాలతో హిందీ సినిమాలకు పోటీ ఎదురవుతోంది.

రికార్డులను నేషనల్ వైడ్ లెక్కబెట్టే పరిస్థితి వచ్చేసింది. ఓవర్సీస్ లోనూ సౌత్ సినిమాలు సత్తా చాటుతున్నాయి. బాహుబలి 2 , కేజీఎఫ్ 2 సినిమాలు బాలీవుడ్ సినిమాలకు మించిన కలెక్షన్స్ అందుకున్నాయి. ఇలాగే ఈ క్రిస్మస్ కు బాక్సాఫీస్ వద్ద షారుఖ్ డంకీ, ప్రభాస్ సలార్ సినిమాలు పోటీ పడుతున్నాయి.

టికెట్ బుకింగ్స్ సహా, నెంబరాఫ్ స్క్రీన్స్ లో సలార్ షారుఖ్ డంకీ కంటే పైచేయి సాధిస్తోంది. ప్రభాస్ నటించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కు బుక్ మై షోలో 375కె ఇంట్రెస్ట్స్ రాగా…షారుఖ్ డంకీ మూవీకి లక్ష లోపే ఇంట్రెస్ట్ లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ లోనూ సలార్ అత్యధికంగా 1979 లొకేషన్స్ లో రిలీజ్ కాబోతోంది.

ఇన్ని లొకేషన్స్ షారుఖ్ సినిమాకు దొరకడం కష్టంగానే కనిపిస్తోంది. ఇలా ఓ సౌత్ సినిమా హిందీ సూపర్ స్టార్ సినిమాపై అప్పర్ హ్యాండ్ సాధిస్తోదంటే అందుకు హీరో ప్రభాస్ కున్న క్రేజ్ కూడా ఓ మెయిన్ రీజన్ అనుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *