డిజిటల్ కంటెంట్ పాపులర్ అవుతున్న నేపథ్యంలో వరుస వెబ్ సిరీస్ లు చేస్తోంది నిత్యామీనన్. ఆమె నటించిన కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ లో ఉండగానే..మరో వెబ్ సిరీస్ మాస్టర్ పీస్ తో ఓటీటీలోకి రాబోతోంది. నిత్యామీనన్ నటించిన మాస్టర్ పీస్ వెబ్ సిరీస్ ఈ నెల 25నుంచి డిస్నీఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ చిత్రంలో షరఫ్ యు ధీన్, రెంజి పనికర్, మలా పార్వతి, అశోకన్, శాంతి కృష్ణ కీలక పాత్రల్లో నటించారు. మాస్టర్ పీస్ వెబ్ సిరీస్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజైంది. ఈ ట్రైలర్ హ్యూమరస్ గా సాగింది. అత్త గారి ఇంట్లో భర్తతో, అత్తతో గొడవపడే కోడలిలు రియా పాత్రలో నిత్యా మీనన్ కనిపించింది. అత్త, భర్తపై కోపంతో వచ్చిన ఫ్రస్టేషన్ తో రియా ఇంట్లో వస్తువులన్నీ పగలగొడుతుంటుంది.

భార్యా భర్తల మధ్య అండర్ స్టాండింగ్ లేకుంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయి, అత్తతో కోడలు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి అనేది వినోదాత్మకంగా మాస్టర్ పీస్ వెబ్ సిరీస్ లో చూపించారు. ఈ వెబ్ సిరీస్ కు శ్రీజిత్ దర్శకత్వం వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *