విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ్టి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. యూత్ తో పాటు సకుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఖుషి థియేటర్స్ లో ఘన విజయాన్ని అందుకుంది. ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ అందుకుంది.

విప్లవ్ గా విజయ్, ఆరాధ్యగా సమంత ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసింది. జీవితంలో ఓ జంట కలిసి ఉండాలంటే నమ్మకాలు, ఆచార వ్యవహారాలు ఏవీ అడ్డు కాదని ప్రూవ్ చేసే కథతో ఖుషి తెరకెక్కింది. ఇవాళ్టి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఖుషి మూవీని చాలా మంది చూస్తూ ..ఆ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. హిందీతో పాటు అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో ఖుషి స్ట్రీమ్ అవుతోంది. ఓటీటీలో ఖుషి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *