సలార్ రిలీజ్ డేట్ విషయంలో స్పష్టత రావడంతో ఇక మేకర్స్ ప్రమోషన్ మీద దృష్టి పెట్టబోతున్నారు. నేషనల్ వైడ్ సలార్ ప్రమోషన్ ఫెస్టివల్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సలార్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారట. అలాగే మరో ట్రైలర్ ను కూడా విడుదల చేస్తారట. ట్రైలర్ కు ఎలాంటి రెస్పాన్స్ ఉండబోతోందో టీజర్ కు వచ్చిన రికార్డ్ వ్యూస్ తో అంచనా వేయొచ్చు.

సలార్ ప్రమోషన్ విషయంలో వెనకబడిందనే మాటే వినిపించకుండా ఉండేలా ప్రచార కార్యక్రమాలకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందట. ఇక ప్రస్తుతం సలార్ కంప్లీట్ షూటింగ్ పూర్తి చేసుకుని, ప్యాచప్ వర్క్ జరుపుకుంటోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి.

ప్రభాస్ మీద చిత్రీకరించాల్సిన పాట ఒకటి ఉందని, అది నవంబర్ లో షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు. ఈ పాటతో సలార్ పూర్తిగా రిలీజ్ కు రెడీ అవుతుంది. డిసెంబర్ 22న నేషనల్ వైడ్ సెన్సేషన్ కు సిద్ధమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *