రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా వర్క్స్ సైలెంట్ గా జరిగిపోతున్నాయి. చరణ్ ఇక్కడ గేమ్ ఛేంజర్ మూవీలో బిజీగా ఉండగా..దర్శకుడు బుచ్చిబాబు మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. రెహమాన్ తో పాటల సిట్టింగ్ లో ఉన్న బుచ్చిబాబు..ఆల్రెడీ ఒక పాట ఓకే చేసినట్లు తెలుస్తోంది. రెహమాన్ ఇచ్చిన ఛాట్ బస్టర్ ట్యూన్ తో పాట కంపోజ్ అవుతోంది.

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో మూవీని వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ వృద్ధి సినిమాస్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామా చిత్రమిది. ఇందులో రామ్ చరణ్ క్యారెక్టర్ రా అండ్ రస్టిక్ గా ఉండనుంది.

ఈ సినిమా కోసం సరికొత్త లుక్ లో మేకోవర్ కానున్నారు రామ్ చరణ్. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఆర్టిస్టులను తీసుకుంటున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *