దసరా సూపర్ హిట్ తో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన హీరో నాని…కంటిన్యూయస్ గా సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నాని హాయ్ నాన్న సినిమాలో నటిస్తుండగా..ఇది సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలు ఓకే చేశాడు. వీటిలో ఒకటి తమిళ దర్శకుడితో ఉండగా..మరో సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించబోతున్నారు.

వివేక్ ఆత్రేయ నానితో అంటే సుందరానికీ సినిమాను రూపొందించాడు. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా…దర్శకుడి టాలెంట్ ను, చెప్పిన కథను నమ్మిన నాని మరో సినిమాకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక నాని 31వ సినిమా ఇదే సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం.

ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ను సెలెక్ట్ చేసుకున్నారట. ఈ హీరోయిన్ గతంలో నానితో గ్యాంగ్ లీడర్ సినిమాలో కలిసి నటించింది. ఇదే ఆమెకు ఫస్ట్ టాలీవుడ్ మూవీ. ఈ సినిమా హిట్ కావడంతో ప్రియాంకకు తెలుగులో ఆఫర్స్ వస్తున్నాయి. ప్రియాంక పవన్ తో ఓజీ మూవీలో నటిస్తోంది. నాని సినిమాకు ఆమెకు మంచి ప్రాజెక్ట్ కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *