రామ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించిన యాక్షన్ ఎంటర్ టైనర్ స్కంధ మొన్న గురువారం థియేటర్స్ లోకి గ్రాండ్ గా వచ్చింది. ఈ సినిమా మాస్ ఆడియెన్స్ లో ఉన్న క్రేజ్ కారణంగా ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ రాబట్టింది. తొలిరోజు 8 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు తెచ్చుకుంది. ఇది హీరో రామ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ గా చెప్పుకోవచ్చు. అయితే సెకండ్ డేకే స్కంధ కలెక్షన్స్ సగానికి పైగా తగ్గిపోవడం సినిమా మీద వచ్చిన టాక్ ఇంపాక్ట్ చూపిస్తోంది

ఇవాళ ఆడియెన్స్ ఎంత అటెన్షన్ తో ఉన్నారనేది స్కంధ డే 2 కలెక్షన్స్ చూపిస్తున్నాయి. సినిమా మీద కొద్దిగా డివైడ్ టాక్ వచ్చినా థియేటర్స్ కు వెళ్లే ఆలోచన మానుకుంటున్నారు. తర్వాత చూద్దాంలే అని ఊరుకుంటున్నారు. స్కంధకు ఏపీ తెలంగాణలో రెండో రోజు 4 కోట్ల రూపాయల లోపే కలెక్షన్స్ వచ్చాయి.

అంటే ఫస్ట్ డే తో చూస్తే సగానికి పైగా తగ్గిపోయాయి. సండే వరకు వీకెండ్ కాబట్టి ఓకే, సోమవారం గాంధీ జయంతి హాలీడే కలిసొస్తుంది గానీ మంగళవారం నుంచి స్కంధ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి అనే టాక్ ట్రేడ్ వర్గాల్లో మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *