తన సినిమా మార్క్ ఆంటోనీ సెన్సార్ సర్టిఫికెట్ కోసం లంచం ఇచ్చానంటూ ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు తమిళ హీరో విశాల్. ముంబైలోని సీబీఎఫ్ సీ ఆఫీసర్స్ అక్కౌంట్స్ కు మనీ ట్రాన్స్ ఫర్ చేశానంటూ ఆ అధికారుల బ్యాంక్ డీటెయిల్స్ తో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మార్క్ ఆంటోనీ సినిమా స్క్రీనింగ్ కోసం 3 లక్షల రూపాయలు, సెన్సార్ సర్టిఫికెట్ కోసం 3.5 లక్షల రూపాయలు ఇచ్చానంటూ విశాల్ పేర్కొన్నాడు.

ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసిన విశాల్ అందులో ఈ వివరాలన్నీ చెప్పాడు. నిర్మాతలు ఇలా ఆర్థికంగా నష్టపోవడం దురదృష్టకరమని విశాల్ అన్నాడు. ఇలాంటి పరిస్థితి తాను కెరీర్ లో ఎప్పుడూ ఎదుర్కోలేదని విశాల్ చెప్పాడు. ఎం రాజన్, జీరా రాందాస్ అనే ఇద్దరు సీబీఎఫ్ సీ అధికారులకు తాను లంచం ఇచ్చినట్లు విశాల్ తెలిపాడు. ఈ ట్వీట్ ను మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, ప్రధాని నరేంద్ర మోదీలకు ట్యాగ్ చేశాడు విశాల్. మార్క్ ఆంటోనీ సినిమా ఇటీవలే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *