సూపర్ హిట్ సినిమాల్లో నటించినా కొన్నిసార్లు హీరోయిన్స్ కు లక్ కలిసిరాదు. బ్లాక్ బస్టర్ సినిమా చేసిన హీరోయిన్స్ ఆ తర్వాత ఆఫర్స్ లేక ఇండస్ట్రీ దూరమవడం చూశాం. అలాంటి ఫేజ్ చూస్తోంది కన్నడ హీరోయిన్ శ్రీనిధి శెట్టి. ఈ హీరోయిన్ కు కేజీఎఫ్ లాంటి చరిత్ర సృష్టించిన సినిమాలో నటించినా…ఆ నేమ్ ఫేమ్ అంతా హీరో యష్ కే వెళ్లింది.

సరైన ఆఫర్స్ లేని శ్రీనిధి ఆ మధ్య విక్రమ్ తో కోబ్రా అనే తమిళ సినిమా చేసింది. కేజీఎఫ్ రెండు సినిమాల తర్వాత ఆమె చేసిన ఒకే ఒక సినిమా ఇది. ఈ భామ ఇప్పుడు టాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకత్వం వహిస్తున్న సినిమాకు శ్రీనిధి శెట్టిని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ సినిమా ఆఫర్ దక్కితే నేరుగా శ్రీనిధి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *