రామ్ హీరోగా నటించిన లెేటెస్ట్ మూవీ స్కంధ డే వన్ మంచి కలెక్షన్స్ రాబట్టింది. మాస్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి. ఈ సినిమా రామ్ కెరీర్ లో బెస్ట్ డే వన్ కలెక్షన్స్ నమోదు చేసింది. నైజాం ఏరియాలో 3 కోట్ల రూపాయలు ఈ సినిమాకు రాగా…ఏపీలో 5 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా 8 కోట్లకు పైగా షేర్ ను స్కంధ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది.

అయితే మూవీ టీమ్ మాత్రం తమ సినిమా వరల్డ్ వైడ్ గా 18 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని అనౌన్స్ చేసింది. అంటే రెండు తెలుగు రాష్ట్రాలు మినహాయించి పది కోట్లకు పైగా కలెక్షన్స్ దక్కాయన్న మాట. రామ్ సినిమాకు ఒక్క రోజుల్లో తెలుగు మినహా మిగతా ప్రాంతాల్లో, ఓవర్సీస్ కలిపి అంత రావడం సర్ ప్రైజింగ్ నెంబరే. ఎందుకంటే ఓవర్సీస్ లో ఇంత మాస్, బ్లడ్ షెడ్ ఉన్న సినిమాలకు అంతగా క్రేజ్ ఉండదు.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో దర్శకుడు బోయపాటి శ్రీను స్కంధ మూవీని తెరకెక్కించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించింది. నిన్న రిలీజైన స్కంధ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *