ప్రభాస్ సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కన్ఫర్మ్ కావడంతో క్రిస్మస్ స్లాట్ బుక్ చేసుకున్న సినిమాలన్నింటిలో అలజడి మొదలైంది. డిసెంబర్ 21 నుంచి 23 వరకు మూడు సినిమాలు రిలీజ్ డేట్ పెట్టుకున్నాయి. ఈ మూవీస్ లో డిసెంబర్ 22న రావాల్సిన వెంకటేష్ సైంధవ్ డేట్ మార్చుకునే ఆలోచనలో ఉండగా..ఇప్పుడు నాని కూడా అదే డెసిషన్ లోకి తీసుకుంటున్నట్లు సమాచారం.

హాయ్ నాన్న మూవీ డిసెంబర్ 21న రిలీజ్ కావాలి. సలార్ డిసెంబర్ 22న రిలీజ్ అవుతుండటంతో నాని తన సినిమాను మరో రెండు వారాల ముందుగా డిసెంబర్ 7నే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారట. ఈ సినిమాను కొత్త దర్శకుడు శౌర్యువ్ రూపొందిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

దసరాతో మంచి హిట్ కొట్టిన నాని హాయ్ నాన్న మీద హోప్స్ పెట్టుకున్నారు. అయితే సలార్ మీద తన సినిమా వేస్తే ఓపెనింగ్స్ మీద భారీ ఇంపాక్ట్ పడుతుంది. అందుకే రెండు వారాల ముందుగానే సినిమాను రిలీజ్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదని భావిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *