ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అనౌన్స్ అయినా దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ తన సలార్ రెండు భాగాల షూట్ మీద బిజీగా ఉండగా..ఇటు ఎన్టీఆర్ దేవర వర్క్స్ లో ఉండిపోయాడు. ఎన్టీఆర్ కు వార్ 2 కమిట్ మెంట్ కూడా ఉండగా..ప్రశాంత్ నీల్ కు కేజీఎఫ్ 3 లైన్ లో ఉంది. మహేష్ తో మూవీ కూడా ఫార్మల్ అనౌన్స్ చేశాడు.

ఇన్ని ప్రాజెక్ట్స్, బిజీల మధ్య ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేసుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి టైమ్ లో తమ సినిమాపై క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ నీల్. ఈ స్టార్ డైరెక్టర్ రీసెంట్ గా స్పందిస్తూ వచ్చే సమ్మర్ లో ఎన్టీఆర్ తో మూవీ వర్క్ స్టార్ట్ చేస్తానని అన్నాడు.

దీంతో వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మెగా ప్రాజెక్ట్ ముందడుగు వేస్తుందనే నమ్మకం ఏర్పడుతోంది. జనవరి వరకే ఎన్టీఆర్ దేవర ఫినిష్ చేయాలని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *