రణ్ బీర్ కపూర్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన యానిమల్ సినిమా టీజర్ రిలీజైంది. ఈ సినిమాను టీ సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రను పోషించారు. డిసెంబర్ 1న యానిమల్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా టీజర్ ఎలా ఉందో చూద్దాం.

ప్రేమికులుగా రశ్మిక, రణ్ బీర్ మాట్లాడుకుంటున్నా ఆహ్లాదకరమైన సన్నివేశంతో టీజర్ మొదలైంది. పిల్లల కావాలని అనుకుంటున్నావా అని రశ్మిక అడిగితే…నేను తండ్రిని కావాలని ఉందని ఆన్సర్ ఇస్తాడు రణ్ బీర్. మీ తండ్రి లాగా మాత్రం కాకూడదు అని రశ్మిక అంటే మా నాన్న వరల్డ్ లో బెస్ట్ ఫాదర్ అంటూ తన గతం గురించి చెబుతాడు రణ్ బీర్. గతంలోకి వెళ్తే రిచ్ మ్యాన్ అయిన తండ్రి అనిల్ కపూర్ రణ్ బీర్ కను కొడుతుంటాడు. సమాజం రణ్ బీర్ ను రిచ్ కిడ్ లా లైఫ్ ను ఎంజాయ్ చేయమంటుంది. కానీ అతను మరోలా మారిపోతాడు. డాన్ లా . ప్రపంచంలో చెడును వెతుక్కుంటూ వెళ్లే అతనికి చెడు కనిపించదు. కానీ తనలో వెతికితే మాత్రం మరెక్కడా లేనంత చెడు ఉంటుంది. బుల్లెట్ల వర్షం మీద కురిసి పడిపోయిన రణ్ బీర్…ఇప్పుడే తన వర్క్ మొదలు పెట్టానంటూ చెబుతాడు. శత్రువును చంపే వరకు వదిలిపెట్టను అంటాడు. ఇలా పవర్ ఫుల్ సీన్స్ తో యానిమల్ టీజర్ ఆకట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *