స్టార్ హీరో రామ్ చరణ్ టాలీవుడ్ లో 16 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నారు. ఆయనకు ఇండస్ట్రీ నుంచి ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియా ద్వారా విశెస్ వస్తున్నాయి. రామ్ చరణ్ హీరోగా నటించిన తొలి సినిమా చిరుత 2007, సెప్టెంబర్ 28న రిలీజైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిరుతలో ఫైట్స్, పాటలతో అదరగొట్టిన చరణ్ ఫ్యూచర్ స్టార్ అవుతాడని అనిపించున్నారు.

మగధీర వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశారు రామ్ చరణ్. రచ్చ, ఎవడు, ధృవ వంటి మూవీస్ తో సూపర్ హిట్స్ సాధిస్తూ..తన స్టార్ డమ్ నిలబెట్టుకున్నారు రామ్ చరణ్. ఇక ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లో చరణ్ చూపించిన ఎమోషన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ లో నటిస్తున్నారు రామ్ చరణ్. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామా మూవీ చేస్తున్నారు రామ్ చరణ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *