సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త సినిమా గుంటూరు కారం సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే అనుకున్న టైమ్ కు షూట్ ఆలస్యం కావడంతో బ్రేక్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన స్పెషల్ సెట్ లో గుంటూరు కారం సినిమా చిత్రీకరణ జరుగుతోంది.

ప్రస్తుతం చేస్తున్న షూటింగ్ ఈ వీకెండ్ వరకు జరగనుంది. ఈ షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్, ఇతర కీ యాక్టర్స్ తో మహేశ్ కాంబో సీన్స్ చేస్తున్నారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ గురించి టాక్ వినిపిస్తోంది. దసరా పండుగ ముందే గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారట.

హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ లో దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్న గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తోంది. జగపతి బాబు, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి గుంటూరు కారం సినిమా రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *