విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా వీడీ 13 సంక్రాంతి రిలీజ్ కు వస్తున్నట్లు వెల్లడించింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. వీడీ 13 సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఓ అప్ డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. త్వరలో వీడీ 13కు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఎప్పుడూ సంక్రాంతి సీజన్ అంటే కనీసం రెండు సినిమాలు పెద్దవి, స్టార్ హీరోస్ వి రిలీజ్ అ‌వుతుంటాయి. ఈసారి సంక్రాంతి సీజన్ ఇంకాస్త ఎక్కువగా ప్యాక్డ్ గా ఉంది. మహేశ్ బాబు గుంటూరు కారం జనవరి 12న, రవితేజ ఈగిల్ జనవరి 13న రిలీజ్ అ‌వుతున్నాయి. దీంతో పాటు నాగార్జున నా సామి రంగ మూవీని సంక్రాంతికి అనౌన్స్ చేశారు కానీ డేట్ చెప్పలేదు. హనుమాన్ అనే చిన్న సినిమా కూడా జనవరి 12నే రిలీజ్ అవుతోంది. విజయ్ దేవరకొండ మూవీని జనవరి 14న రిలీజ్ చేస్తే పండుగ మూడు రోజులూ బాక్సాఫీస్ డేట్స్ ఫిల్ అయినట్లే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *