రామ్ హీరోగా నటించిన స్కంధ మూవీ ఇవాళ థియేటర్స్ లోకి వచ్చింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ సంస్థలో దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను రూపొందించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించింది. స్కంధ మూవీ చివరలో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇచ్చారు దర్శకుడు బోయపాటి. దీంతో స్కంధ 2 ఫ్యూచర్ లో ఉంటుందనేది కన్ఫర్మ్ అయ్యింది.

ఇక ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన స్కంధ మూవీకి యావరేజ్ టాక్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ బాగున్నా, ఇంటర్వెల్ బ్యాంగ్ తేలిపోయిందని, సెకండాఫ్ ఫర్వాలేదనే సినిమా చూసిన వాళ్లు చెబుతున్నారు. ఈ మిక్స్డ్ టాక్ మధ్య సినిమా యావరేజ్ అంటూ రివ్యూస్ కూడా వస్తున్నాయి. సాధారణంగా ఫస్ట్ పార్ట్ హిట్ అయితేనే సీక్వెల్ ఉంటుంది లేకపోతే ఆ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపించరు. స్కంధ రన్ బాగుంటేనే స్కంధ్ 2 గురించి ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *