ఏమాత్రం పోలికలు లేకుండా బాహుబలి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న కర్ణాటకలోని మైసూర్ మ్యూజియం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. నిర్మాత శోభు యార్లగడ్డ ఈ విగ్రహం ఏర్పాటుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను సంప్రదించకుండా విగ్రహం ఏర్పాటుచేశారంటూ ట్వీట్ చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో మైసూర్ మ్యూజియం నిర్వాహకులు స్పందించారు. విగ్రహాన్ని త్వరలోనే తొలగిస్తామంటూ ఓ ప్రమఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ప్రభాస్ బాహుబలి విగ్రహం డిజైన్ పై విమర్శలు వస్తున్నాయి. సినిమా నిర్మాత కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. ఎవరి మనోభావాలను కించపరచడం మా ఉద్దేశం కాదు. త్వరలోనే ఈ విగ్రహాన్ని మ్యూజియం నుంచి తొలగిస్తాం. అని మ్యూజియం నిర్వాహకులు తెలిపారు. బాహుబలి పాత్ర మేకోవర్ ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉండగా…మ్యూజియంలో మాత్రం పోలికే లేని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *