ఖుషితో సూపర్ హిట్ అందుకుని ఉత్సాహంలో ఉన్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ…తన కొత్త సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. వీడీ 13 వర్కింగ్ టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా రాబోయో సంక్రాంతి రేసుకు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ.

వీడీ 13 నుంచి షూటింగ్ ప్రోగ్రెస్ ను మేకర్స్ ఇవాళ వెల్లడించారు. ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని వారు తెలిపారు. వీడీ 13 సినిమా వచ్చే సంక్రాంతి పండుగకు గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. గీత గోవిందం వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కు ఉన్న బ్లాక్ బస్టర్ ఇమేజ్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద క్రేజ్ పెంచుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *