విజయ్ దేవరకొండ రశ్మిక మందన్న టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్. వీరు కలిసి నటించిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. గీత గోవిందం బాక్సాఫీస్ హిట్ కొట్టగా…డియర్ కామ్రేడ్ ఈ జంట పర్ ఫార్మెన్స్ కు, కెమిస్ట్రీకి మంచి పేరు తీసుకొచ్చింది.

డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్, రశ్మిక ఎప్పుడు కలిసి మూడో సినిమా చేస్తారా అనేది వీడీ ఫ్యాన్స్ లో ఉంటూ వచ్చిన ప్రశ్న. ఇప్పుడు దీనికి సమాధానం దొరికినట్లే. త్వరలోనే విజయ్, రశ్మిక కలిసి తెరపై కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలో విజయ్ దేవరకొండ ఒక మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రశ్మికను తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు శ్రీలీలను హీరోయిన్ గా అనుకోగా…తాజాగా ఆమె ప్లేస్ లో రశ్మికకు అవకాశం దక్కిందట. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ త్వరలో అఫీషియల్ గా చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *