స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరో క్రేజీ ప్రాజెక్ట్ కు కమిట్ అయినట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో ఆయన ఈ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే దిల్ రాజు బ్యానర్ లో పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే విజయ్ తో మరో సినిమా దిల్ రాజు ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ రీసెంట్ గా అనౌన్స్ అయ్యింది. ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తారని అంటున్నారు. రాజా వారు రాణి గారు, అశోకవనంలో అర్జున కల్యాణం వంటి మూవీస్ తో రవికిరణ్ కోలా టాలెంటెడ్ డైరెక్టర్, రైటర్ గా పేరు తెచ్చుకున్నారు. విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ యంగ్ డైరెక్టర్ కు బిగ్ ఛాన్స్ దక్కినట్లే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *