టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సలార్ ఎఫెక్ట్ మొదలైంది. ప్రభాస్ సలార్ మూవీ ఈ క్రిస్మస్ కు వస్తుందనే బలమైన టాక్ నేపథ్యంలో అప్పటికి ప్లాన్ చేసుకున్న సినిమాలు ఆల్టర్ నేట్ రిలీజ్ డేట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ విషయంలో వేగంగా స్పందించారు వెంకీ మామ.

విక్టరీ వెంకటేష్ నటిస్తున్న 75వ సినిమా సైంధవ్ డిసెంబర్ 22న రిలీజ్ కావాల్సి ఉంది. అదే డేట్ కు సలార్ వస్తుండటంతో తన రిలీజ్ డేట్ మార్చుకునే పనిలో పడింది సైంధవ్. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది.

సైంధవ్ మూవీని యాక్షన్ థ్రిల్లర్ గా దర్శకుడు శైలేష్ కొలను రూపొందిస్తున్నారు. నీహారికా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. హిట్, హిట్ 2 మూవీస్ సక్సెస్ తర్వాత దర్శకుడు శైలేష్ చేస్తున్న సైంధవ్ మీద పాజిటివ్ బజ్ ఉంది. ఇక వెంకీ ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి ఫన్ సబ్జెక్ట్స్ తర్వాత చేస్తున్న సీరియస్ యాక్షన్ మూవీ ఇది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *