కర్ణాటకలోని మైసూర్ లో ఓ మ్యూజియంలో బాహుబలి గెటప్ లో ఉన్న ప్రభాస్ మైనపు విగ్రహాన్ని పెట్టారు. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విగ్రహం తమను సంప్రదించకుండా అనధికారికంగా పెట్టారంటూ నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విగ్రహాన్ని వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన ట్వీట్ చేశారు.

బాహుబలి గెటప్ లో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఏమాత్రం ఆకర్షణ లేకుండా తయారు చేశారు. ఈ విగ్రహం అసలు ప్రభాస్ లా కనిపించడమే లేదు. బాహుబలి ప్రభాస్ హెయిర్ స్టైల్ కు ఈ విగ్రహం హెయిర్ స్టైల్ కు సంబంధమే లేదు. అనధికారికంగా ప్రభాస్ మైనపు విగ్రహాన్ని తయారు చేసిన వారిపై అటు అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ మైనపు విగ్రహం ఇప్పటికే లండన్ లోని ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *